Sunday, January 19, 2025
HomeసినిమాYash, Geetu Mohandas: యశ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..?

Yash, Geetu Mohandas: యశ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..?

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యశ్. ఈ సినిమాలతో కన్నడలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే.. ఇప్పటి వరకు యశ్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. అభిమానులు ఎప్పుడెప్పుడు యశ్ కొత్త సినిమాని ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. గతంలో యశ్ శంకర్ తో మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. అందులో వాస్తవం లేదని తెలిసింది. అయితే.. యశ్ నెక్ట్స్ మూవీని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో చేయనున్నారని సమాచారం.

గీతూ మోహన్ దాస్ ఒకప్పుడు హీరోయిన్ గా పలు మలయాళ సినిమాల్లో నటించారు. ఆతర్వాత దర్శకురాలిగా మారారు. ఆమె భర్త రాజీవ్ రాయ్ ఫేమస్ కెమెరామెన్. అలాగే దర్శకుడు కూడా. ఆమె డైరెక్టర్ గా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇప్పటి వరకు రెండు సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు మూడవ చిత్రం కోసం యశ్ ని కాంటాక్ట్ చేయడం.. గ్యాంగ్ స్టర్ స్టోరీ చెప్పడం.. కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. అయితే.. కేజీఎఫ్ 2తో వచ్చిన క్రేజ్ తర్వాత యశ్.. లేడీ డైరెక్టర్ తో మూవీకి ఓకే చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ చిత్రంలో మలయాళ నటుడు టోవినో థామస్ నెగటివ్ రోల్ చేయనున్నట్లు టాక్. ఈ మూవీ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వివరాలను త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్