Friday, March 13, 2026
HomeTrending NewsKhammam: ఖమ్మం కార్పోరేషన్ కు నిధుల వరద

Khammam: ఖమ్మం కార్పోరేషన్ కు నిధుల వరద

రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్… పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ద్వారా ఖమ్మం కు 100 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ఈ రోజు జీవో కాపీ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి మరో 100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్… కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్ కుమార్ కి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular