Saturday, November 23, 2024
HomeTrending NewsBabu at KIA: నా దూరదృష్టికి కియా తార్కాణం: చంద్రబాబు

Babu at KIA: నా దూరదృష్టికి కియా తార్కాణం: చంద్రబాబు

అనంతపురం జిల్లాలో మరో ప్రపంచం కియాను సృష్టించింది తానేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది తన దూరదృష్టికి తార్కాణమని, భావి తరాలకు ఏమి కావాలో ఆలోచించడమే తన విధానమని…విధ్వంసంతో సర్వనాశనం చేయడం జగన్ విధానమని వ్యాఖ్యానించారు.  ప్రాజెక్టులపై యుద్ధ భేరీ పేరిట సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న బాబు నేడు అనంతపురం జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కియా మోటార్స్ ను సందర్శించి అక్కడి ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు.కియా కార్ల్ కంపెనీ వద్ద చంద్రబాబు నాయుడు సేల్ఫీ ఛాలెంజ్ విసిరారు.  ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

ఈ జిల్లా ఋణం తీర్చుకునేందుకే  2014లో సిఎం అయిన తర్వాత  జీడిపల్లి, చెర్లోపల్లి, నారాల ప్రాజెక్టులను తీసుకు వచ్చానని, కియా పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయమని అడిగితే నీరు ఎక్కడుందని అడిగారని, ఆరు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి ఈ పరిశ్రమను తీసుకు వచ్చామని వివరించారు. కరువు సీమలో సిరులు పండించిన కియా ఇక్కడకు రావడం టిడిపి విజయమన్నారు. 12,800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పారని, ఎన్ని రాష్ట్రాల వారు పోటీ పడ్డా…దానిలో తాము నెగ్గి ఇక్కడకు తెచ్చామన్నారు.  ఇటీవలే 10 లక్షల కార్ల ఉత్పత్తి పూర్తి చేసుకొని ఉత్సవాలు చేసుకున్నారని తెలిపారు. 13 వేల మందికి నేరుగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి కలిగిందన్నారు. 56వేల కోట్ల రూపాయలు జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చిందన్నారు.  ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఉన్నవి వెళ్లిపోతున్నాయని, జాకీ అలాగే వెళ్లిందన్నారు.  ఒకప్పుడు అనంతపురం అంటే క్లాక్ టవర్ చూపించేవారని, ఇప్పుడు కియా చూపిస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, మండలానికి రెండు ప్రాంతాల్లో వర్క్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కంపెనీ లో ఉద్యోగాలు వచ్చినవారు తనను మర్చిపోవచ్చని, భూముల ధరలు పెరిగిన వారు కూడా తనను మర్చి పోవచ్చని, అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ కూడా తమ పార్టీని ఓడించారని… కానీ ఒక  మంచి పని చేశానన్న తృప్తి తనకుందన్నారు. ప్రజలు కూడా స్ఫూర్తి తెచ్చుకొని మంచి-చెడులపై విశ్లేషించుకొని.. ధర్మాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్