Tuesday, March 10, 2026
Homeసినిమారామ్‌చ‌ర‌ణ్‌ సరసన మరోసారి కియారా అద్వాని

రామ్‌చ‌ర‌ణ్‌ సరసన మరోసారి కియారా అద్వాని

టాలీవుడ్‌లో ‘విన‌య విధేయ‌రామ‌’, ‘భ‌ర‌త్ అనే నేను’ చిత్రాల్లో న‌టించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇప్పుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం(జూలై 31) కియారా అద్వాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు. రామ్ చరణ్ సరసన కియారా రెండోసారి నటిస్తోంది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటించిన ‘వినయ విదేయ రామ’ లో కియారా హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా కియారా అద్వాని మాట్లాడుతూ “ఇప్ప‌టి వ‌ర‌కు నా పుట్టిన‌రోజు వ‌చ్చిన గిఫ్టుల్లో ఖచ్చితంగా ఇది బెస్ట్ బ‌ర్త్ డే గిఫ్ట్‌. చ‌ర‌ణ్‌, శంక‌ర్‌గారు, రాజు గారు, శిరీశ్‌ గారు..ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో సినిమా చేస్తుండ‌టం నాకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అలాగే నెర్వ‌స్‌గానూ అనిపిస్తుంది. చాలా గొప్ప అవ‌కాశం. షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను” అని అన్నారు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 15వ చిత్ర‌మిది. అలాగే శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న50వ చిత్రం. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రూపొంద‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular