Saturday, January 18, 2025
Homeసినిమాకిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ పోస్టర్‌ విడుదల

కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ పోస్టర్‌ విడుదల

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్‌ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం పట్ల చాందినీ ప్రేమ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తుంది. గడ్డంతో కిరణ్‌  హాండ్సమ్‌ గా కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సతీష్‌ రెడ్డి మాసం సినిమాటోగ్రఫర్‌. విల్పావ్‌ నిషాదం ఈ చిత్రానికి ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్