Saturday, January 18, 2025
HomeసినిమాBigg Boss 7 List: 'బిగ్ బాస్ 7' ఇంట్రస్టింగ్ న్యూస్

Bigg Boss 7 List: ‘బిగ్ బాస్ 7’ ఇంట్రస్టింగ్ న్యూస్

బుల్లితెర పై సంచలనం బిగ్ బాస్. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక సీజన్ కు మించి మరో సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో తాజాగా రానున్న ‘బిగ్ బాస్ 7’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆఖరికి టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్ బాస్ 7కు హోస్ట్ గా చేస్తున్నట్టుగా ఇటీవల అఫిషియల్ గా ప్రకటించారు. అయితే.. బిగ్ బాస్ 7 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ ఫేమస్ రియాల్టీ గేమ్ షో ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. సెప్టెంబర్ 3న అని ప్రకటించారు.

అయితే… ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొంటారు అనేది ఆసక్తిగా మారింది కానీ.. ఇంతకు ముందులా ఇప్పుడు బిగ్ బాస్ 7 లో పాల్గోనే వారి లిస్ట్ బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. కిరణ్ రాథోడ్, షకీలా ఇద్దరూ బిగ్ బాస్ 7 లో పార్టీసిపేట్ చేయనున్నారని తెలిసింది. కిరణ్ రాధోడ్ భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, కెవ్వుకేక, జెమిని తదితర చిత్రాల్లో నటించింది. ఇక షకీలా గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరిని ఎంపిక చేశారని తెలిసింది. ఇంకా మిగిలిన వాళ్ల వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 నిమిషాలకు, శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ 7 ప్రసారం కానుందని సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్