Saturday, July 6, 2024
HomeTrending Newsపగటి కలల్లో కెసిఆర్ - కిషన్ రెడ్డి ఎద్దేవా

పగటి కలల్లో కెసిఆర్ – కిషన్ రెడ్డి ఎద్దేవా

కెసిఆర్ కుటుంబం అవినీతికి మీటర్ లు పెడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. అవినీతిపై లెక్కకు లెక్క తీస్తామన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… బిజెపి నేతలవే కాదు, trs నేతలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోన్ లు ట్యాప్ అవుతున్నాయన్నారు. ఏ మాత్రం అవగాహన ఉన్న దేశంలో ఉపఎన్నికతో పాటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది అనేది తెలుస్తుందని, మునుగోడు ఎన్నికకు బిజెపి పూర్తిగా సిద్దంగా ఉందన్నారు.

మునుగోడులో బిజెపి భారీ మెజారిటీతో గెలుస్తుందని… మునుగోడు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తామని కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను స్వాగతిస్తున్నామన్నారు. మోటర్ లకు మీటర్ ల ప్రచారం ని ప్రజలు నమ్మలేదని… MiM, YSRCP, TDP, cpi,cpm, aidmk లు కూడా జాతీయ పార్టీలే అన్నారు. దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదని… కెసిఆర్ చెప్పిన ప్రళయం ఎంటోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూశారని అందులో కొత్త దానం ఏమి లేదన్నారు.  దేశంలో ఒక్క సీటు లేని జాతీయ పార్టీ లు ఉన్నాయని, ఎవరు ఏందో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కెసిఆర్ పార్టీ గెలవదు అని పెట్టే బేడ సర్దుకుని పోయాడని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

కేంద్రం పై విష ప్రచారం చేస్తున్నారని, కెసిఆర్ ప్రధాని అయినట్టు ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్టు కేటీఆర్ సీఎం అయినట్టు ఆ కుటుంబం పగటి కలల్లో ఉన్నారని వ్యంగ్యంగా విమర్శించారు. కెసిఆర్… ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దేశంలో ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి రావడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ ను కలిసిన నేతలు కూడా ఆ మాటలు మేము అనలేదని వివరణ ఇచ్చుకుంటున్నారన్నారు. జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పండిందని అసహ్యించుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ కోసమే కెసిఆర్ పార్టీ పెడుతున్నారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Also Read : తెలంగాణలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా -కిషన్ రెడ్డి  

RELATED ARTICLES

Most Popular

న్యూస్