Saturday, January 18, 2025
HomeTrending Newsఢిల్లీ బోనాలకు కేంద్రం నిధులు: కిషన్ రెడ్డి

ఢిల్లీ బోనాలకు కేంద్రం నిధులు: కిషన్ రెడ్డి

Bonalu: ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.  న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్ లో లాల్ దర్వాజా సింహ వాహిని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధానిలో ఉన్న తెలంగాణా వాసులను మమేకం చేసి ఈ ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమన్నారు.

ఏడేళ్ళ నుంచి బోనాల ఉత్సవ కమిటీ ఢిల్లీ లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని, వచ్చే ఏడాది నుంచి ఇంకా పెద్ద ఎత్తున జరపాలని , దీనికోసం పర్యాటక శాఖ నుంచి  నిధులు  ఇస్తామని హామీ ఇచ్చారు.  సికింద్రాబాద్ లోని లాల్ దర్వాజాలో 114 సంవత్సరాల నుంచి అమ్మవారు పూజలు అందుకుంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట సాంస్కృతిక, టూరిజం శాఖ అధికారులు కూడా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్