Saturday, January 18, 2025
HomeTrending Newsకేంద్ర ఉత్సవాల జాబితాలో బోనాలు: కిషన్ రెడ్డి

కేంద్ర ఉత్సవాల జాబితాలో బోనాలు: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో బోనాలు ఉత్సవాలను కూడా చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండోరోజు ఉత్సవాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కులాలకు అతీతంగా అమ్మవారికి బోనాలు జరిపే అద్భుతమైన పండుగ ని పేర్కొన్నారు. తెలుగు ఆడపడుచులకు, తెలంగాణ ప్రజలకు, ఆడబిడ్డలకు  కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్