తెలంగాణ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు, తెలంగాణకు తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు.
ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8:20 గంటలకు అంబర్‌పేటకు చేరుకుని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి 8:50 గంటలకు చేరుకొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గన్‌పార్క్ వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.