Saturday, November 23, 2024
HomeTrending Newsనెలాఖరుకు చెల్లిస్తాం: కొడాలి నాని

నెలాఖరుకు చెల్లిస్తాం: కొడాలి నాని

ఏది రైతు ప్రభుత్వమో, ఏది రాక్షస ప్రభుత్వమో రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. రైతులకు బకాయిపడిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు ఇవ్వలేదని టిడిపి నేతలు విమర్శలు చేయడం అర్ధ రహితమని పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం సరాసరి ఏటా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ రెండేళ్లలో తాము ఒక్కో ఏడాది 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. రైతాంగం కొట్టిన దెబ్బకు చంద్రబాబు మతి తప్పిందని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని నాని అన్నారు.

ఒకేసారి 135 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారని, క్యాబినెట్ లో, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేశారని… పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించారని, ఎన్ని ఒత్తిడులు వచ్చినా 56 శాతం పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లకు కేటాయించారని నాని వివరించారు. ఈ విషయాన్ని మరుగున పడేసేందుకే రైతుల ఆందోళనలను తెరపైకి తెచ్చారని కొడాలి ధ్వజమెత్తారు.

నాని మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • చంద్రబాబు ఐదేళ్ళలో ధాన్యం కొనుగోళ్లకు చెల్లించింది రూ. 8,500 కోట్లు
  • మా ప్రభుత్వం ఏటా రూ. 16,000 వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేస్తోంది
  • గతంలో రెండు నెలలు, మూడు నెలల తర్వాత డబ్బులు చెల్లించేవారు
  • ఇప్పుడు 21 రోజుల్లోపు రైతులకు డబ్బులు చెల్లించాలన్న నిబంధన సిఎం జగన్ పెట్టారు
  • రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు కేంద్ర ప్రభుత్వం 5,056  కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది
  • దీనిపై సిఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు, మా ఎంపీలు ఢిల్లీ లో సంప్రదింపులు జరుపుతున్నారు
  • ఈ నెల 25 నాటికి 1600 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
  • నాబార్డ్ నుంచి 1600 కోట్ల రూపాయలు లోన్ అమౌంట్ ఇస్తామన్నారు
  • మంగళ, బుధ వారాల్లో రైతులకు చెల్లిస్తాం
  • రైతులకు ఇంకా మొత్తం 3393 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది
  • మా ప్రభుత్వం పెట్టుకున్న 21 రోజుల్లోగా చెల్లించాల్సిన నిధులు 1204 కోట్ల రూపాయలు మాత్రమే అలస్యమైంది
  • ఈ నెలాఖరులోపు రైతాంగానికి ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇచ్చి తీరుతాం
  • చంద్రబాబు మాటలు రైతాంగం నమ్మొద్దు
  • రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
RELATED ARTICLES

Most Popular

న్యూస్