Sunday, February 23, 2025
HomeTrending NewsKodali: చిరంజీవిని ఎప్పుడూ గౌరవిస్తా: కొడాలి

Kodali: చిరంజీవిని ఎప్పుడూ గౌరవిస్తా: కొడాలి

చిరంజీవిని తాను దూషించలేదని… రోడ్లు, ప్రత్యేక హోదా,  పోలవరం  ప్రాజెక్టు, ప్రజలకు సంక్షేమం లాంటి అంశాల్లో ఆయన తమకు సలహాలు ఇస్తే … ఇలాంటి సలహాలే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పకోడీ గాళ్ళకు ఇవ్వాలని  చెప్పానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.  గుడివాడలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి పాల్గొన్నారు.  డ్యాన్సులు, నటన రాని, సినిమాలు తీయడం రానివాళ్ళు రాజకీయ నాయకులకు సలహాలు ఇస్తున్నారని అలాంటి పకోడీ గాళ్ళకు చెప్పాలని చిరును కోరానని అన్నారు. చిరంజీవిని దూషించినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.

చిరంజీవికి డ్యాన్స్, యాక్షన్, సినిమాలు తీయడం  రాదా అంటూ కొడాలి ఎదురు ప్రశ్నించారు. ఇవేవీ రానివారిపైనే  మాట్లాడానని వివరణ ఇచ్చారు. కానీ కొంతమంది ఆయన్ను తానేదో అన్నట్లు ఆందోళన చేయడం ఏమిటన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ జనసేన, టిడిపి నాయకులపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటితో తనకు-చిరంజీవికి-వారి అభిమానులకు మధ్య అగాథాన్ని  సృష్టించాలేరని తేల్చి చెప్పారు. చిరంజీవిని ఎప్పుడూ గౌరవిస్తానని, ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కొడాలి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్