ఇటీవల బ్రో సినిమాపై తలెత్తిన వివాదంపై మెగాస్టార్ చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు చేయగా వాటిపై మాజీ మంత్రి కొడాలి నాని కూడా అదే స్థాయిలో స్పందించారు. బ్రో సినిమాలో తనను పోలిన పాత్ర పెట్టి కించ పరిచేలా వ్యవహరించాలని, అసలు ఈ సినిమా ఆర్ధిక లావాదేవీలపై విచారణ జరిపించాలని, దీనిలో నటించిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ పై కూడా రాంబాబు స్పందించారు.
వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి ఈ విషయంపై స్పదించారు. “మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి… అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు… అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై కొడాలి ప్రతిస్పందిస్తూ… కొంతమంది పకోడీగాళ్ళు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహా ఇస్తున్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ లో చాలామంది పకోడీగాళ్ళు ఉన్నారని, వాళ్ళు తమకు సలహా ఇచ్చే ముందు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే సలహా ఇవ్వాలని…. “ప్రభుత్వం గురించి మనకెందుకు… డ్యాన్స్ లు, ఫైట్లు, మన యాక్షన్ మనంచూసుకుందామని వాళ్లకు సలహా ఇవ్వొచ్చు కదా” అంటూ కౌంటర్ ఇచ్చారు.