గుడివాడలో గత ఐదేళ్ళలో రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ‘మీ హయంలో గుడివాడలో పేదల ఇళ్ళ స్థలాల కోసం కనీసం ఒక్క ఎకరా పొలం అయినా కొన్నావా’ అంటూ మండిపడ్డారు. గుడివాడ నియోజకవర్గంలో నాడు వైఎస్ 160 ఎకరాలు, ఇప్పుడు జగన్ హయంలో 250 ఎకరాలు సేకరించామని.. 23 వేల మందికి ఇళ్లస్థలాలు ఇప్పించామని వెల్లడించారు. బాబు హయలో ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని, గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోతానని సవాల్ చేశారు. బాబుకు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కోరారు.
గతంలో ఎన్టీఆర్ ను గంజాయి మొక్క అని తిట్టిన బాబు ఇప్పుడు పొగుడుతున్నారని, ఆయన చావుకు బాబు కారణం కాదా.. తనను గంజాయి మొక్క అనడంపై కొడాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గుడివాడ ముద్దుబిడ్డనని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని… గంజాయి మొక్కను కాదని స్పష్టం చేశారు.
‘నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు, ఆర్ధిక ఇబ్బందులతో కాదా.. ఎన్టీఆర్ కుటుంబం రోడ్ల వెంట ఆలో లక్ష్మణా అంటూ తిరుగుతున్నారు.. బాబు తనను ఏమీ చేయలేరని. బాబు ఉడుత వూపులకు చింతకాయలు రాలవని, చచ్చినా బతికినా బాబు ఎంత దుర్మార్గుడో చెబుతూనే ఉంటా… ఆయనను నన్ను ఏమీ చేయలేరు’ అంటూ ధ్వజమెత్తారు. గెలుపుకోసం పవన్ కళ్యాణ్ బూట్లు నాకి ఏదో విధంగా బైట పదాలని చూస్తున్నారన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గుడివాడ వచ్చి టిడిపి వర్థంతి కార్యక్రమం చేశారన్నారు.