Tuesday, March 10, 2026
Homeసినిమాశ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ‘ఆటో రజిని’ ప్రారంభం.

శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ‘ఆటో రజిని’ ప్రారంభం.

శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో సావిత్రి. జె నిర్మిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ, రాజకీయ అతిరథుల‌ సమక్షంలో ఘనంగా జరిగాయి.  బాపట్ల ఎం. పి నందిగం సురేష్ తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టగా, ఆంద్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్దార్థరెడ్డి ,గౌతంరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ “పెద్ద పెద్ద హీరోల సినిమాలకు వర్క్ చేశాను. ‘ఎదురులేని మనిషి’ చేసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. కొడాలి నాని గారు, సురేష్ గారు, సిద్దా రెడ్డి, గౌతంరాజు ఇలా అందరూ వచ్చి మా ‘ఆటో రజని’ని బ్లెస్స్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు జగన్ గారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్ అండ్ యాక్షన్ మూవీ తీస్తున్నాం. వైజాగ్ విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి విజయవాడలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. నవంబర్లో సినిమా పూర్తి చేసుకుని హాలిడేస్ లో విడుదల చేస్తాం. ఇంత వరకూ నేను తీసిన సినిమా రిలీజ్ చేసుకోవడానికి భయపడేవాడిని. 30 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో అందరు హీరోలతో చేశాను. నేను సరైన సపోర్ట్ లేక నిలబడలేక పోయాను. ఈ రోజు ఇంత మంది అన్నలు నాకు సపోర్ట్ గా ఉన్నందుకు నాలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నా సినిమాను ఖ‌చ్చితంగా రిలీజ్ చేసుకుంటాననే ధైర్యం ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular