Sunday, February 23, 2025
HomeTrending Newsమర్డర్ చేస్తా అంటే ఊరుకుంటారా? కొడాలి

మర్డర్ చేస్తా అంటే ఊరుకుంటారా? కొడాలి

Be careful: బుద్దా వెంకన్న అరెస్టుపై మంత్రి కొడాలి స్పందించారు. వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదన్నారు. మంత్రిని మర్డర్ చేస్తా. ..డీజీపీకి క్యాసినో లో వాటాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అనేక అసభ్యకర కార్యక్రమాలను ఆ పార్టీ నేతలే చేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు ఇంటి గేటు టచ్ చేస్తే తనను చంపేస్తానని బుద్దా వెంకన్న మాట్లాడారని,  బాబు తన ఇంటి గేటు వద్ద వెంకన్నను కత్తి ఇచ్చి కాపలా పెట్టారా అని కొడాలి ప్రశ్నించారు. క్యాసినో వ్యవహారంలో తన మంత్రి పదవి ఊడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గుడివాడలో నా కన్వెన్షన్ సెంటర్ లో ఏదో క్యాసినో జరిగి పోయిందని టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని  సవాల్ చేశాక మాట మార్చారని… తొలుత కే కన్వన్షన్ సమీపంలో  జరిగిందని, తర్వాత  గుడివాడలో జరిగిందని మాట మార్చారని గుర్తు చేశారు. చంద్రబాబును ప్రజలు రెండున్నర ఏళ్లక్రితం రాజకీయ సమాధి చేశారని, పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని కొడాలి హెచ్చరించారు.

Also Read : క్యాసినో నడిపితే నో పోలీస్: నారా లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్