Tuesday, March 17, 2026
HomeTrending NewsKodali-Perni: పాదరసం కంటే వేగం కొడాలి: పేర్ని ప్రశంస

Kodali-Perni: పాదరసం కంటే వేగం కొడాలి: పేర్ని ప్రశంస

కొడాలి నాని చదువుకోనివాడిగా… గెడ్డం, మెడలో రుద్రాక్ష వేసుకొని రౌడీగా కనిపించవచ్చని కానీ పాదరసం కంటే కూడా వేగంగా పనిచేసే బుర్ర ఆయనకు ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కితాబిచ్చారు. వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తాను చూసిన వారిలో అత్యంత తెలివిగల వ్యక్తి కొడాలి అని వ్యాఖ్యానించారు. శత్రువులు, తెలియని వాళ్ళు ఏదో రెండ్రోజులు వచ్చి మాట్లాడి వెళ్లి పోతుంటారని  అయన గురించి అనుకుంటారని…కానీ ఐదోసారి కూడా గెలిచేందుకు అన్ని స్కెచ్ లు వేసుకొని కూర్చున్నారని, తప్పకుండా కొడాలి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తారని పేర్ని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఎలాగైతే జనం గుండెల్లో పాతుకు పోయారో, గుడివాడ ప్రజల గుండెల్లో అంటే సుస్థిర పునాదులు వేసుకొని ఉన్నారని ప్రశంసించారు. గుడివాడలో రూ.8.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పేర్నినాని, పామర్రు, అవనిగడ్డ ఎమ్మెల్యేలు కైలే అనిల్, సింహాద్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పేర్నినాని మాట్లాడుతూ మే 19న సిఎం జగన్ గుడివాడలో పర్యటించి నూతన బస్టాండ్ నిర్మాణానికి  శంఖుస్థాపన చేస్తారని, అదే రోజున 8,900 మంది పేద, మద్య తరగతి వర్గాలకు టిడ్కో ఇళ్ళ తాళాలు అందజేస్తారని వెల్లడించారు. కొత్త పంపుల చెరువు భూ సేకరణ కోసం జీవో ప్రభుత్వం ఇవ్వబోతోందని, 45 కోట్ల రూపాయలు దీనికోసం విడుదల చేయబోతున్నారని చెప్పారు. ఈ పనుల కోసం కొడాలి ఎంత కష్టపడ్డారో తనకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular