Thursday, March 19, 2026
HomeTrending Newsకొడంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కొడంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. గుర్నాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ MLA గురునాథ్ రెడ్డి..ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరనున్న కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి,ఎంపీపీ ముద్దప్పలు. 7 సార్లు MLA గా చేసిన గురునాథ్ రెడ్డీ కొడంగల్ లో తిరుగులేని నేతగా పేరుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించిన గురునాథ్ రెడ్డి.

కొడంగల్ నియోజకవర్గంలోని దిగ్గజ నాయకుల్లో గుర్నాథ్ రెడ్డి ఒకరు. సొంతంగా 30 వేల ఓట్లు కలిగి ఉన్న నేత గురునాథ్ రెడ్డీ పార్టీ వీడడంతో బీఆర్ఎస్ కు గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కోడంగల్ పర్యటనలో ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటి అయిన గురునాథ్ రెడ్డి పాదయాత్ర పై చర్చిస్తున్నారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను మార్పునకు నాంది పలుకనుంది. గుర్నాథ్ రెడ్డి చేరికతో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనే చర్చ సాగుతోంది.

Also Read : తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు -గవర్నర్ తమిళ్ సై

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular