Saturday, January 18, 2025
Homeసినిమానిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు

నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు

లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తొలి సినిమాకు శ్రీకారం చుట్టారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. విభిన్న కథాంశంతో రూపొందే ఈ చిత్రంతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జూలై 15న కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కోడి దివ్య. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించ నున్నారు.

కిరణ్ అబ్బవరం నటిస్తున్న 5వ సినిమా ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు. హీరో: కిరణ్ అబ్బవరం, సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ శంకర్, బ్యానర్: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: కోడి దివ్య దీప్తి, సంగీతం: మణి శర్మ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్