Wednesday, March 18, 2026
HomeTrending Newsఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్

ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్

Koheda Fruit Market : హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ ఏర్పాటు కాబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగ ఉందని, రాష్ట్ర ఉద్యాన పంటల రైతులు, విక్రయదారులకు మంచి రాబోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రి వెల్లడించారు. కోహెడ మార్కెట్ నిర్మాణ ఉద్దేశాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని, 178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ఏర్పాటు .. ఢిల్లీ మార్కెట్ కన్నా ఇది చాలా పెద్దదన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు రూ.50 లక్షలతో కోహెడ పండ్ల మార్కెట్ కు వంద ఫీట్ల రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణంపై కోహెడలో ఉద్యాన రైతులు, విక్రయదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం, బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్ ను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

సాగులో వ్యవసాయ పంటల విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది .. కానీ ఉద్యాన పంటలకు ప్రాధాన్యం, విలువ ఎక్కువ ఉంటుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి, భవిష్యత్ లో మరింత మారతాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కూరగాయలు తక్కువ అన్నం, రొట్టెలు ఎక్కువ తింటే, ఇప్పుడు కూరలు, పండ్లు ఎక్కువ తింటున్నారని, మానవుల వినియోగ అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నదని తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గడ్డిఅన్నారం మార్కెట్ సౌకర్యంగా లేదని, ఉత్పత్తులకు అనుగుణంగా రాష్ట్రంలో ఆహారశుద్ది పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

ఉద్యాన పంటల సాగుకు అనుగుణంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్ కు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడం కోహెడ మార్కెట్ కు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ను పెంచుతున్నదని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్ రూపుదిద్దేందుకు లే అవుట్ సిద్దమవుతున్నదని, అప్పటి వరకు క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బాటసింగారంలో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, తెలంగాణలో 50 వేల ఎకరాలలో ఆలుగడ్డ సాగు లక్ష్యంతో ఆలుగడ్డ విత్తనం స్టోరేజీ లక్ష్యంగా కోహెడ కోల్డ్ స్టోరేజీ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ వ్యవసాయం కేసీఆర్ నాయకత్వంలో దశ, దిశ మార్చుకున్నది .. వారి ఆలోచనల మూలంగానే తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతున్నదన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా దుకాణాల కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : తెలంగాణ విత్తన రంగంలో మరో మైలు రాయి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular