పిసిసి అధ్యక్ష పదవి తన దృష్టిలో చాలా చిన్న పదవి అంటూ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో సమావేశాయారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. తెలంగాణ లోనే పెండింగ్ అంశాలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి మొదటినుంచీ వివాద రహితుదని, సౌమ్యుడని కొనియాడారు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధి పై దృష్టి సారించాలని హితవు పలికారు. తన నియోజకవర్గ ప్రజలకు, జిల్లాకు , తెలంగాణకి అందుబాటులో ఉంటానని, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని కోమటిరెడ్డి వివరించారు.
రేవంత్ రెడ్డి చిన్నపిల్లాడని, అతని గురింఛి తన వద్ద మాట్లాడొద్దని సూచించారు. రాజకీయాల గురించి మాట్లాడనని గతంలోనే చెప్పానని, అభివృద్ధి పైనే దృష్టి సారించానని కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. నేనేందుకు పార్టీ మారుతా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపే సమర్ధవంతమైన నాయకుడు లేడని, ఎవరి నియోజకవర్గం వారు గేలిపించుకుంటే అదే ఎక్కువని నిర్వేదం వ్యక్తం చేశారు.