Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అర్హులందరికీ సంక్షేమం : కోన రఘుపతి

అర్హులందరికీ సంక్షేమం : కోన రఘుపతి

అర్హతే ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. ఆదివారం విజయనగరంలో పర్యటించిన కోన,  స్థానిక 38వ డివిజన్లోని బొబ్బాది పేట, ఆర్టీసీ లేఅవుట్ ప్రాంతాల్లో జరిగిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తదితరులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రెండేళ్లలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతూ, ప్రజల మన్ననలను చూరగొంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి ఇవ్వడం, చేయడం మాత్రమే తెలుసని గత ప్రభుత్వం మాదిరి అధికారం చెలాయించడం తెలియదని అన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజల ముంగిటికే పాలన అందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలు అందే విధంగా చూడడం జగన్మోహన్రెడ్డి నూతన పాలనా విధానానికి నిదర్శనమని అన్నారు.

రైతు ప్రభుత్వం గా మన్ననలు అందుకుంటున్న ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ పోలవరం తో సహా అన్ని ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో కొనసాగుతూ ఉండటం గుర్తించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవడం విశేషమన్నారు. చివరి గింజ వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. రెండేళ్ల క్రితం నగరానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఎంతో తేడా కనిపించిందన్నారు. నగరమంతా పరిశుభ్రంగా ఉండటం అభివృద్ధి దిశగా బాటలు వేయడం సంతోషంగా ఉందన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్