Sunday, January 19, 2025
Homeసినిమారామ్ గోపాల్ వ‌ర్మ‌ ‘కొండా’ చిత్రం ప్రారంభం

రామ్ గోపాల్ వ‌ర్మ‌ ‘కొండా’ చిత్రం ప్రారంభం

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకంపై మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలు గా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న చిత్రం ‘కొండా’. కొండా మురళి,  సురేఖ జీవిత కథ ఆధారంగా చిత్రీకరిస్తున్న చిత్రం ఇది.. ఈ చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంత ఊరు వంచనగిరి లో ఘనంగా ప్రారంభం అయింది. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయం లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. వరంగల్ ప్రజలు ఈ చిత్రం ఓపెనింగ్ కి తండోపతండాలుగా విచ్చేసి హర్షద్వానాలతో ముహూర్తపు సన్నివేశాన్ని తిలకించారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. విజయవాడలో చదువుకున్నాను. ఆంధ్రలో జరిగిన చరిత్ర అంతా తెలుసు కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. కొండా మురళి గారి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. వాళ్ళ జీవిత కథని అందరికీ తెలియాలి అని కొండా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కొండా మురళి మామూలు మనిషి కాదు అని చాలా చెప్పారు. ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో పుడతారు. ఎవరేం చేసిన పుట్టిన, పెరిగిన పరిస్థితి అన్నీ కలిసి ఒక కలెక్టివ్ మైండ్ మీద ఎఫెక్ట్ ఇచ్చి అప్పుడు వారి కున్న ధైర్యంతో మంచి కోసం, న్యాయం కోసం ఎదురు తిరిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉండగా మిగిలిన వారంతా కూడా బానిసలుగా వుంటారు”

“కొండ మురళి తో కలిసి నేను తిరిగిన తర్వాత నేను సురేఖమ్మ గారి కంటే మురళిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. నేను చూసిన అందరిలో కంటే వీరు బెస్ట్ కపుల్స్. కొండ గారి కపుల్స్ ది చాలా యూనిక్ థింగ్ ఇలాంటి రిలేషన్ షిప్ తో ఉన్న ఫ్యామిలీ నేను ఇప్పటి వరకు చూడలేదు. అందుకే వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. కొండా అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. కొండా లాంటి సినిమా ఇప్పటి వరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్