Friday, March 20, 2026
Homeసినిమా'ఎన్టీఆర్ 30' పై కొరటాల ఏమన్నారంటే...

‘ఎన్టీఆర్ 30’ పై కొరటాల ఏమన్నారంటే…

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన  ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో వారిద్దరూ తాజాగా చేస్తోన్న ‘ఎన్టీఆర్ 30‘పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా ‘ఆచార్య’ ఫ్లాప్ అవ్వడంతో బాగా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై  అంచనాలు మరింతగా పెంచింది.  ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీని 2024, ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే  తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న  కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ  అందరి ఆశీస్సులతో మూవీని ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తామని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల చేస్తామని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నార్త్ లో ఎన్టీఆర్ కు బాగా క్రేజ్ ఏర్పడింది. మరి.. ఈ భారీ పాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular