Saturday, January 18, 2025
Homeసినిమాఅంచనాలకు మించి 'దేవర' క్లైమాక్స్! 

అంచనాలకు మించి ‘దేవర’ క్లైమాక్స్! 

ఎన్టీఆర్ హీరోగా కొరటాల ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన భారీ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ – సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇందుకోసం ఒక రేంజ్ లో ఖర్చు చేయనున్నారని టాక్.

‘దేవర’ సినిమాలో ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అందువలన యాక్షన్ సీన్స్ పై ఎక్కువగా దృష్టిపెట్టారు. కథానాయకుడు వాడే ఆయుధాలను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. ఆ ఆయుధాలతోనే టైటిల్ డిజైన్ చేయించడంతో, అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగినట్టుగానే ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా కనిపించనుందనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోయింది.

ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ కి తగినట్టుగానే, సైఫ్ విలనిజాన్ని తీర్చిదిద్దారట. తెరపై ఈ రెండు పాత్రలు తలపడే తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. సైఫ్ విలనిజంలోని షేడ్స్ ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ద్వారానే జాహ్నవి కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ – జాన్వీ జోడీని చూడటానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, దసరా పండుగ సందర్భంగా, అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్