Sunday, January 19, 2025
Homeసినిమాడిఫరెంట్ కాన్సెప్టులకు పెరుగుతున్న డిమాండ్!

డిఫరెంట్ కాన్సెప్టులకు పెరుగుతున్న డిమాండ్!

Mini Review:  కార్తి హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’ తమిళంతో పాటు ఇతర భాషల్లోను సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసి లోకేశ్ కనగరాజ్ కి విజయ్ .. కమల్ .. రజనీ అవకాశాలు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగని చెప్పి ‘ఖైదీ’ అనేది భారీ తారాగణం .. భారీ బడ్జెట్ సినిమానా అంటే కాదు. మరి ఆ సినిమా ఎందుకు అంతటి విజయాన్ని సాధించింది అంటే ఆ కథలలో ఉన్న కొత్తదనమనే చెప్పాలి.

సాధారణంగా ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే పోలీస్ లు కాపాడతారు. కానీ అలాంటి పోలీసులను ఒక ‘ఖైదీ’ కాపాడటమే ఈ కథలోని కొత్త పాయింట్. తన కూతురును చూడాలనే ఎమోషన్ ను పక్కన పెట్టి మరీ ఖైదీ ఈ పని చేస్తాడు. అలాగే మయాళంలో కొంతకాలం క్రితం ‘నాయట్టు’ అనే సినిమా వచ్చింది. జోజు జార్జ్ .. కుంచాకో బోబన్ .. నిమిషా సజయన్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా ఈ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో చేసిన ఈ సినిమా, అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ కథలోను కొత్తదనం కనిపిస్తుంది. సాధారణంగా ఖైదీలను పోలీసులు తరుముతూ ఉంటారు. ఈ కథలో పోలీసులను పోలీసులే తరుముతుంటారు. అందుకు ఉన్న రీజన్ సహజంగా అనిపించడం వలన ఈ కంటెంట్ కనెక్ట్ అయింది. ఆ సినిమానే ఇప్పుడు ‘కోటబొమ్మాళి పీఎస్’ టైటిల్ తో గీతా ఆర్ట్స్ 2 వారు రీమేక్ చేశారు. నిన్ననే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కొన్ని మార్పులు చేశారు. డిఫరెంట్ కాన్సెప్టులకు ఈ మధ్య కాలంలో ఇక్కడ కూడా డిమాండ్ పెరిగిపోతోంది.  మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్