Friday, March 20, 2026
Homeసినిమాసోమవారం ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్

సోమవారం ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్

Teaser coming: యంగ్ & హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా సినిమా ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. నాగశౌర్య తొలిసారి బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్ టీజర్ కు  సంబంధించిన అప్ డేట్  తెలియజేసింది.

మార్చి 28న తీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్లో నాగ శౌర్య, షిర్లీ సెటియా రొమాంటిక్ ఫోజ్ లో కనిపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కృష్ణ వ్రిందా విహారి వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular