Saturday, January 18, 2025
HomeTrending Newsఇది చీకటి ఒప్పందం : సంపత్

ఇది చీకటి ఒప్పందం : సంపత్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ కు చీకటి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలు, రాజకీయ లబ్ధి కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పడు కృష్ణా నీటి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామని వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటన చేసినా టిఆర్ఎస్ సర్కార్ నిమ్మకునిరెత్తినట్టు ఉందని, ఇప్పుడు హడావుడి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ పై టిఆర్ఎస్ సర్కార్ మొదటి నుంచీ వివక్ష చూపుతోందని దుయ్యబట్టారు. ఆర్డీఎస్ ను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

కాగా,  కేఆర్ఎంబి సమావేశం కంటే ముందే పోతిరెడ్డిపాడును పరిశీలించాలని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సూచించారు.  దక్షిణ తెలంగాణకు పెద్ద ద్రోహి కేసీఆర్ అని అభివర్ణించారు. కృష్ణా నీటిని ఏపి సర్కార్ బేసిన్ దాటి తరలిస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. నీటిని తరలించుకుపోవాలని గతంలో ఏపీకి  సలహా ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారిని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ మంత్రులకు బుద్ధిలేదని, అర్థం లేకుండా మాట్లాడుతున్నారని నాగం ఘాటుగా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్