Saturday, January 18, 2025
Homeసినిమా‘బంగార్రాజు’లో కృతిశెట్టి ఉందా? లేదా?

‘బంగార్రాజు’లో కృతిశెట్టి ఉందా? లేదా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్ ఇది. గత కొన్ని సంవత్సరాలుగా బంగార్రాజు కథ పై కసరత్తు జరుగుతూనే ఉంది. ఆఖరికి కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథకు నాగార్జున ఓకే చెప్పారు. త్వరలో బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నటిస్తోన్న నాగచైతన్య సరసన నటించేందుకు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని కన్ పర్మ్ చేశారని వార్తలు వచ్చాయి.

అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై ఆరా తీస్తే.. కృతిని కాంటాక్ట్ చేసిన విషయం వాస్తవమే. కాకపోతే ఇంకా ఆమె ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదని తెలిసింది. కారణం ఏంటంటే.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. డేట్స్ ఖాళీగా లేవు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాగచైతన్య డేట్స్ ను బట్టి కృతి డేట్స్ ఇవ్వాలి. అందుచేత ప్రస్తుతానికి కృతి ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ చిత్రాన్ని విడుదల చేయాలనేది నాగార్జున ప్లాన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్