Sunday, January 19, 2025
Homeసినిమాప‌వ‌ర్ స్టార్ మూవీలో సర్పంచ్ నాగలక్ష్మి?

ప‌వ‌ర్ స్టార్ మూవీలో సర్పంచ్ నాగలక్ష్మి?

Krithi: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయ‌క్ మూవీతో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్లో త్వ‌ర‌లో.. ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ ‘తాజా షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆత‌ర్వాత గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తో మూవీ చేయ‌నున్నారు. ఇది జూన్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ సముద్రఖని డైరక్షన్ లో పవన్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా కోసం కృతిశెట్టిని తీసుకోనున్నారని టాక్. అయితే.. ఈ అమ్మ‌డు న‌టించేది ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న అని స‌మాచారం.

ఈ సినిమాలో పవన్ పాత్ర కాకుండా సాయితేజ్ పాత్ర వాస్తవానికి వృద్దుడి పాత్ర. అయితే.. తెలుగు ప్రేక్ష‌కుల‌ కోసం యువకుడి పాత్రగా మారుస్తున్నారు. అందువల్ల పాటలు, ఫైట్లు అన్నీ వుంటాయి. అందుకే హీరోయిన్ గా ఆ ఛాన్స్ కృతిశెట్టి ద‌క్కించుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది,  బంగార్రాజు సినిమాలో నాగలక్ష్మి పాత్రలో నటించిన కృషి నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అందించనున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.

Also Read : ఉప్పెన భామకు హ్యాట్రిక్ దక్కేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్