Sunday, January 19, 2025
HomeసినిమాKrithi Shetty: ఎప్పుడూ నా ఫేవరేట్ చైతూనే: కృతి శెట్టి 

Krithi Shetty: ఎప్పుడూ నా ఫేవరేట్ చైతూనే: కృతి శెట్టి 

నాగచైతన్య – కృతి శెట్టి జంటగా ‘కస్టడీ’ సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. వెంకట్ ప్రభు మాట్లాడుతూ, తెలుగులో ఇది తన ఫస్టు మూవీ అనీ, చైతూ సహకరించడం వల్లనే ఈ సినిమా అనుకున్న స్థాయిలో వచ్చిందని అన్నాడు.

చైతూ మాట్లాడుతూ .. ఈ కథను వెంకట్ ప్రభు చెప్పగానే తనకి బాగా నచ్చేసిందనీ, వెంటనే చేసేయాలనే ఒక ఆత్రుతను కలిగించిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదేనని అన్నాడు. ఈ సినిమాకి ఎంత ఖర్చు అయిందనేది తనకి తెలియదుకానీ, భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమానే అనే విషయం అర్థమైపోతూనే ఉంటుందని చెప్పాడు. కథ మొదలైన 40 నిమిషాల్లో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అన్నాడు.

ఇక కృతి శెట్టి మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను రేవతి పాత్రను పోషించాననీ, తన పాత్ర వెంటనే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంది. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. శివ పాత్రలో చైతూ న్యాయం కోసం పోరాడితే, తన పాత్ర అతని ప్రేమ కోసం పోరాడుతూ ఉంటుందని అంది. శివ పాత్రను చూస్తే రేవతి మాత్రమే కాదు, అతని ప్రేమలో అందరూ పడిపోతారని చెప్పింది. తన ఫేవరెట్ ఎప్పుడూ చైతూనే అంటూ, తన ‘బంగార్రాజు’ అని సంభోదిస్తూ ఆడిటోరియంలో హుషారు పెంచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్