Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచరిత్ర తిరగరాసి.. గుర్రమెక్కిన పెళ్లికూతురు

చరిత్ర తిరగరాసి.. గుర్రమెక్కిన పెళ్లికూతురు

Bride on Horse:
చరిత్ర సృష్టించాలన్నా మేమే- చరిత్ర  తిరగరాయాలన్నా మేమే  అంటున్నారు ఈ కాలం అమ్మాయిలు. అటువంటి సాహసమే చేసి చూపింది కృత్తికా సైనీ…

అదో పెళ్లి ఊరేగింపు…. గుర్రంపైన ఠీవిగా తలపాగా ధరించి కత్తి పట్టిన రూపం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. కారణం ఆ వ్యక్తి పెళ్లికూతురు కావడం. ఈ అరుదైన సంఘటనకు వేదిక రాజస్థాన్లోని రణోలి గ్రామం. కృత్తికా సైనీ అనే యువతి తన వివాహం సందర్భంగా తరాల సంప్రదాయాన్ని ధిక్కరించి బండోరి వేడుకలో ఇలా గుర్రంపై షేర్వాణీ లో దర్శనమిచ్చింది. స్వయంగా ఈమే తన షేర్వాణీ కుట్టుకుందట.

కృత్తిక తండ్రికి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అందరిలోకీ చిన్నదైన ఈ అమ్మాయి జైపూర్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. పాఠశాల స్థాయినుంచి స్కౌట్స్ ఉద్యమంలో  ఏడేళ్లపాటు పాల్గొని అనేక అవార్డులు అందుకుంది.  అయితే పెళ్లి ఉరేగింపు ఐడియా ఆమె తండ్రిదే.  తన కూతురిని అలా చూడాలని ఆయన కోరిక. లింగ సమానత్వం చాటినట్టు ఉంటుందని ఆమె కుటుంబం ఇందుకు ప్రోత్సహించింది. ఆడ పిల్లలను చిన్నచూపు చూస్తారనే రాజస్థాన్ వంటి రాష్ట్రంలో చిన్న గ్రామంలో ఇటువంటి మార్పు శుభ సూచకం.

వెల లేని బహుమతి
పెళ్ళి శుభలేఖలు పంచేటపుడు శక్తిని బట్టి బహుమతులు ఇస్తుంటారు.  అందులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడో సామాజిక  కార్యకర్త. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ కు చెందిన మల్లేష్ తనకుమార్తె వివాహం సందర్భంగా సుమారు రెండువేల భారత రాజ్యాంగ ప్రతులు ముద్రించారు. పెళ్లి శుభలేఖతో పాటు రాజ్యాంగ ప్రతినీ పంచుతున్నారు.  ఇది కదా స్ఫూర్తి! భేష్ మల్లేష్! బడా బడా రాజకీయ నాయకుల కంటే ఎంతో మేలైన ఆలోచన చేసినందుకు అభినందనలు.

Also Read : ప్రేమకోసం…

RELATED ARTICLES

Most Popular

న్యూస్