Thursday, February 27, 2025
Homeసినిమా‘రిచి గాడి పెళ్లి’ టీమ్ సాయం

‘రిచి గాడి పెళ్లి’ టీమ్ సాయం

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సుమారు 1000 కుటుంబాలకు చేదోడుగా నిలిచింది కె.ఎస్.ఫిలిం వర్క్స్ సంస్థ. షూటింగ్ మొత్తం ఊటీలో జరగడం వలన ఆ పరిసర ప్రాంతాలైన కళ్ళట్టి, మసనగుడి వంటి గ్రామాలను ఎంచుకొని అవసరం ఉన్న వారికి నిత్యావసరాలు అందించారు. ఈ సంస్థ నుండి వస్తోన్న మొదటి చిత్రం “రిచి గాడి పెళ్లి” విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్ర విశేషాలు పంచుకుంటూ దర్శకుడు హేమరాజ్ కె.ఎస్… ‘రిచిగాడి పెళ్లి’ మానవ బంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో అనుకోని పరిణామం  కరోనా.. దేశం మొత్తం లాక్ డౌన్ తో స్తంభించి పోయింది. చాలా మంది ఉపాధి కోల్పోవడం గమనించాం. వారందరికీ ఏదోటి చెయ్యాలని సాధ్యమైన రీతిలో నిత్యావసర సరుకులు అందించామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్