Sunday, January 19, 2025
Homeసినిమా‘ఓ సాథియా’ ఖచ్చితంగా హిట్ అవుతుంది - కె.ఎస్.రామారావు

‘ఓ సాథియా’ ఖచ్చితంగా హిట్ అవుతుంది – కె.ఎస్.రామారావు

సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకం పై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ RK సినీ ప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత KS రామారావు, త్రినాథరావు నక్కిన విచ్చేశారు. వారితో పాటు చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత KS రామారావు చేతుల మీదుగా ఓ సాథియా ట్రైలర్ విడుదల అయింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత KS రామారావు మాట్లాడుతూ.. ఒక చిన్న సినిమా తీసి, రిలీజ్ అవ్వడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ గారు కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడాలి అప్పుడే పైకి వస్తాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయాలి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ సంస్థ UFO రిలీజ్ చేయడం చాలా మంచి విషయం. UFO లాంటి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడం ఈ సినిమా వాళ్ళ అదృష్టం. నేను కూడా సినిమా కెరీర్ లో చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు బాగుంది అని చెప్తే సినిమా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ అవసరం. ప్రతి నిర్మాతకు ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది. నా బర్త్ డే జులై 7. ఆ రోజే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ..ఇక్కడ అందరూ యంగ్‌స్టర్స్ ఉన్నారు. మమ్మల్ని పెద్దవాళ్ళు అంటున్నారు, మేము కూడా యంగ్‌స్టర్సే. అమ్మ, నాన్న, ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, ఫస్ట్ లవ్ అందరికి ఇష్టం. హీరో తన గురించి చెప్తుంటే నా మొదటి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి. అందరికి ఆ కష్టాలు ఉంటాయి. ఈ సినిమాకి నిర్మాత, డైరెక్టర్ ఇద్దరూ లేడీస్ కావడం చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నిర్మాతకు ఒక ఇంటికి ఇంకో ఇల్లు రావాలని కోరుకుంటున్నాను. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే.. నిజంగానే ఫస్ట్ లవ్ గుర్తుకురావాలని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్