Thursday, February 27, 2025
Homeసినిమాశరత్ మరార్ తో ‘క్షీరసాగర మథనం’ ట్రైలర్ విడుదల

శరత్ మరార్ తో ‘క్షీరసాగర మథనం’ ట్రైలర్ విడుదల

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం “క్షీరసాగర మథనం”. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగా రూపొందిన ‘క్షీర సాగర మథనం’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6… థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా “క్షీర సాగర మథనం” ట్రైలర్ రిలీజ్ అవుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్