Friday, March 20, 2026
Homeసినిమాఅమెజాన్ లో దూసుకెళ్తున్న క్షీర సాగర మథనం

అమెజాన్ లో దూసుకెళ్తున్న క్షీర సాగర మథనం

‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన విభిన్న కథా చిత్రం ‘క్షీర సాగర మథనం’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సున్నితమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ క్షీరసాగర మథనం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై… కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలోసంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. అమెజాన్ లో 499వ చిత్రంగా విడుదలైన “క్షీరసాగర మథనం” చిత్రం “టక్ జగదీష్” తర్వాత రెండో స్థానంలో నిలవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular