#AskKTR: బిజెపి విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సుపరిపాలన-సుస్థిరతే బిజెపి ద్వేష ప్రచారానికి సరైన సమాధానంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రజలతో కేటియార్ మమేకమయ్యే #AskKTR కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు. పలువురు నెటిజేన్లు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానాలు ఇచ్చారు.
బిజెపి చేసే అసత్య ప్రచారం మూర్ఖత్వమని, దాన్ని వదిలి వేయడమే మంచిదని సూచించారు. కేంద్రంలో రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా, అభివృద్ధి చేయలేక పోవడం వల్ల ఇప్పటికీ మతాన్నే బిజేపీ తన ఎజెండాగా కొనసాగిస్తోందని అయన ఎద్దేవా చేశారు. ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ ఈ శతాబ్దపు జుమ్లాగా కేటియార్ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గేలిచే అవకాశం ఉందన్నారు.
ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు ప్రభుత్వం లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆస్క్ కేటీఆర్ నేటి సెషన్ జాతీయస్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్ లో నంబర్ వన్ గా నిలిచింది.
అయితే 317 జీవో, వనమా రాఘవ ఎపిసోడ్, నిరుద్యోగ భ్ర్రుతి, ఉద్యోగ నోటిఫికేషన్లపై పలువురు నెటిజెన్లు అగిడిన ప్రశ్నలకు కేటిఆర్ సమాధానాలు ఇవ్వలేకపోయారు.