Sunday, March 15, 2026
HomeTrending Newsమోదీకి థాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్‌

మోదీకి థాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ సెటైర్‌ వేశారు. దేశాన్ని నడుపుతున్న డబుల్‌ ఇంజిన్‌ మోదీ, ఈడీ అని దీంతో అర్థమవుతున్నదని ట్వీట్‌ చేశారు.
కాగా, రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఎత్తివేత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. రాయితీ ఎత్తివేయాలన్న నిర్ణయం బాధాకరమని అన్నారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతే కాదు, విధి కూడా అని కేంద్ర మంత్రికి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Also Read : మోడీది రాజకీయ వికృత క్రీడ – కెసిఆర్ ధ్వజం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular