Monday, February 24, 2025
HomeTrending Newsకేటిఆర్ బృందానికి ఘనస్వాగతం

కేటిఆర్ బృందానికి ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే. తారకరామారావుకి ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి చేరుకున్న మంత్రికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్నారైలు భారీగా ఘనస్వాగతం తెలిపారు. ఎయిర్పోర్టులో మంత్రి కేటీఆర్ కి పూల బొకేలు అందించి స్వాగతం తెలిపారు.

మంత్రి కే తారకరామారావు లాస్ ఏంజిల్స్ లో తనకు స్వాగతం పలికిన ఎన్నారైలతో తర్వాత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని మంత్రి కేటీఆర్ చేశారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్