Monday, January 20, 2025
HomeTrending Newsసిద్ధాంతాల ప్రకారమే వామపక్షాల పోరాటాలు - కూనంనేని

సిద్ధాంతాల ప్రకారమే వామపక్షాల పోరాటాలు – కూనంనేని

చట్టాల మీద వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి బండి సంజయ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ రోజు హైదరాబాద్ లో విమర్శించారు. అసహనంతో బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ వ్యాఖ్యలపై.. ఘాటు గా స్పందించిన కూనంనేని సాంబశివరావు..అడ్డంగా దొరికిన బుకాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని, డిల్లీ డిల్ కు నువ్వేందుకు ప్రమాణాలు చేస్తున్నావని ప్రశ్నించారు. ధైర్యం దుమ్ము ఉంటే మోదీతో ప్రమాణం చేయించూ..అని బండి సంజయ్ కు హితవు పలికారు. మీకు భక్తి లేదు.. దేవుడంటే నమ్మకం లేదని, మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికలో.. కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాడని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపిని గద్దె దించేందుకే మీము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకు కలిశామని స్పష్టం చేశారు. నీకు దుమ్ము ఉంటే రాజ్యాంగ పై ప్రమాణం చేయ్‌…మీరేందుకు టిడిపితో పొత్తు పెట్టుకున్నారని, వారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు..మీరు చేస్తే సంసారం మీము పొత్తు పెట్టుకుంటే.. తప్పా అన్నారు. గవర్నర్ వ్యవస్థలా సి‌‌బిఐ తయారు అయిందని, చాలా రాష్ట్రాలు సిబిఐని బహిష్కరించాయన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సిబిఐ అనుమతి లేదని జీ.వో ఇచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్ట కుండా ఎన్నికల బరిలో ఉంటామని ప్రమాణం చేయండన్నారు. మీరు ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చా అని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టి.ఆర్.యస్ ను గెలిపించాల్సిన బాధ్యత అక్కడ ప్రజలపై ఉందని, కమ్యూనిస్టులు ఎప్పుడూ తప్పు చేయరన్నారు. సిద్ధాంతాల ప్రకారమే మా పోరాటాలు ఉంటాయని, ప్రజల కోసమే నిరంతరం పని చేస్తామని కూనంనేని సాంబశివరావు తెగేసి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్