Saturday, January 18, 2025
HomeసినిమాKushi Review: 'ఖుషి' రియల్ టాక్ ఏంటి..?

Kushi Review: ‘ఖుషి’ రియల్ టాక్ ఏంటి..?

Review: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్, సమంత, శివ నిర్వాణ ఈ ముగ్గురికి ఫెయిల్యూర్ లో ఉన్నారు. అందుచేత ఖచ్చితంగా ఖుషి సినిమాతో సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో ఖుషి సినిమా పాటలు, టీజర్ అండ్ ట్రైలర్ కు పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కూడా బాగుంటుందనే టాక్ రిలీజ్ కు ముందే వచ్చింది. భారీ అంచనాలతో ఖుషి సినిమా ఈరోజు (సెప్టెంబర్ 1న) విడుదలైంది. మరి.. ఖుషి రియల్ టాక్ ఏంటి..?

కథగా చెప్పుకుంటే సింపుల్ స్టోరీ.. కులాలు, మతాలు వేరైన విజయ్, సమంత ప్రేమించుకోవడం.. ఇంట్లో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం. ఆతర్వాత వీళ్ల లైఫ్ లో సమస్యలు రావడం.. వాటిని నుంచి ఎలా బయటపడ్డారు అనేదే కథ. అయితే.. ఈ కథలో మన ఆచారాలు, సంప్రదాయాలు పాటించే బ్రాహ్మిణ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా సమంత నటిస్తే.. నమ్మకాల్ని మూఢనమ్మకాలు అని బలంగా నమ్మే క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిగా విజయ్ దేవరకొండ నటించాడు. విజయ్, సమంతలకు పిల్లలు పుట్టాలంటే హోమం చేయాలని సమంత ఫాదర్ చెబితే.. అలాంటివి చేయాల్సిన అవసరం లేదనే విజయ్ ఫాదర్.. చివరకు ఏమైంది..? అనేదే మిగిలిన కథ.

ఇటీవల కాలంలోనే ఈ తరహా కథతో నాని, అంటే.. సుందరానికి, నాగశౌర్య కృష్ణవ్రిందవిహారి అనే సినిమాలు వచ్చాయి. కథలో కొత్తదనం ఏమీ లేదు కానీ.. విజయ్, సమంతల కోసం ఓసారి సినిమా చూడచ్చు అనే టాక్ వచ్చింది. వీళ్లిద్దరు పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉంటే.. లాస్ట్ థర్ట్ మినిట్స్ ఎమోషనల్ గా ఉంది. అయితే.. ఈ సినిమాకి నిడివి ఎక్కువ అయ్యిందని.. అక్కడక్కడా బోర్ అనే ఫీలింగ్ కలిగిందనే టాక్ కూడా వినిపిస్తుంది. విజయ్, సమంతల నటన, సాంగ్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అని చెప్పచ్చు. డైరెక్టర్ శివ నిర్వాణ సింపుల్ స్టోరీనే తీసుకున్నా బాగానే హ్యాండిల్ చేశాడు. ఈ  మొత్తానికి సింపుల్ స్టోరీతో తెరకెక్కిన మంచి సినిమా అని చెప్పచ్చు. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తుందో..? ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్