ఈఎస్ఐలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై రెండ్రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధికారులను ఆదేశించారు. కార్మిక శాఖలో వివిధ విభాగాలపై మంత్రి జయరాం సమీక్ష నిర్వహించారు. ఈఎస్ఐ డెరైక్టర్ తో మంత్రి ఈ విషయమై చర్చించారు. నివేదిక ఆధారంగా ఈ ఘటనకు బాధ్యలైన వారిపై తగు చర్యలు తీసుకుంటాని జయరాం వెల్లడించారు.
ESI డిస్పెన్సరీ మందులు లభ్యత మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు నిర్దేశించారు. లేబర్ సెస్ వసూళ్ళపై ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ జి.రేఖారాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవలే గుంటూరు వ్యవసాయ క్షేత్రములో జరిగిన బాయిలర్ ఘటన పై బాయిలర్ల డైరెక్టర్ ఉమ మహేశ్వర్ రావుతో మంత్రి ఆరా తీశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు.