Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అన్ని ESI ఆస్పత్రుల్లో ధన్వంతరి సేవలు : మంత్రి జయరాం

అన్ని ESI ఆస్పత్రుల్లో ధన్వంతరి సేవలు : మంత్రి జయరాం

ధన్వంతరి యాప్ ఈ ఎస్ ఐ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతోందని కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. గుణదల ESI డిస్పెన్సరీని సందర్శించిన మంత్రి కార్మికులను అడిగి వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ధన్వంతరి యాప్ ను కార్మికులు ఏ విధంగా ఉపయోగించుకుంటారో తెలుసుకున్నారు. గత రెండు నెలల్లో  480 మంది కార్మికులు ఈ ఆన్లైన్  APP ద్వారా గుణదల ESI ఆస్పత్రిలో వైద్య సేవలు ఉపయోగించుకున్నారని అధికారులు మంత్రికి వివరించారు.

కార్మికులు క్యూన్లలో నిలబడి వేచి ఉండకుండా, ఆన్లైన్ ద్వారా డాక్టర్ల అప్పాయింట్మెంట్ పొందుతున్నారని, ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా యాప్ ను కార్మికులు వినియోగించుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. దేశంలో న్యూఢిల్లీ తరువాత మన రాష్ట్రంలో మాత్రమే ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో వైద్యసేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ ఆన్ లైన్ యాప్ ను త్వరలోనే రాష్ట్రంలోని మిగతా 76 డిస్పెన్సరీలలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్పెన్సరీలలో E.C.G రక్త పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని IMS డైరెక్టర్ కి మంత్రి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్