Wednesday, March 18, 2026
Homeసినిమా'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుండి లచ్చిమి పాట విడుదల

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి లచ్చిమి పాట విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం‘ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కథాంశాన్ని ఆవిష్కరించిన టీజర్ వీడియోలో అల్లరి నరేష్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించారు.

తాజాగా ‘లచ్చిమి’ అనే పాటని విడుదల చేసిన యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది. శ్రీచరణ్ పాకాల ఎనర్జిటిక్ గా కంపోజింగ్ లో…  జావేద్ అలీ తన వాయిస్ తో మెస్మరైజ్ చేయగా.. శ్రీమణి అందించిన సాహిత్యం పాటకు మరింత నిండుదనం తెచ్చింది.  పచ్చని ప్రకృతి అందాలు ఈ పాటలో చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 11న విడుదల ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular