Saturday, September 21, 2024
HomeసినిమాMahaveerudu: హడావిడి లేకుండా వస్తే ఇలాగే ఉంటుంది మరి! 

Mahaveerudu: హడావిడి లేకుండా వస్తే ఇలాగే ఉంటుంది మరి! 

ఇప్పుడు ప్రేక్షకుడు ఓటీటీ సినిమాలను .. వెబ్ సిరీస్ లను తప్పించుకుని థియేటర్ కి రావాలి .. కాదు .. వచ్చేలా చేయాలి. అప్పుడు థియేటర్ దగ్గర కాస్త సందడి కనిపిస్తుంది. లేదంటే ఏ సినిమా ఎప్పుడు థియేటర్ కి వచ్చిందనేది కూడా తెలియకుండానే పోతుంది. కథ ఏదైనా .. కాన్సెప్ట్ ఏదైనా .. స్టార్స్ ఎవరైనా సినిమాకి కావలసింది పబ్లిసిటీ. రిలీజ్ కి ముందు ఒక రేంజ్ లో జరిగే ప్రమోషన్స్. అలా చేయకపోతే ఆ సినిమాల రిలీజ్ డేట్స్ ను గుర్తుపెట్టుకుని సినిమాకి వెళ్లే పరిస్థితిలో జనాలు లేరు.

ఈ మధ్య కాలంలో థియేటర్స్ కి వచ్చిన సినిమాలను .. అక్కడ వాటికి వచ్చిన రెస్పాన్స్ ను చూసుకునే ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంటున్నాయి. అందువలన ప్రమోషన్స్ మొదలుపెట్టకుండానే చాలా సినిమాలు హఠాత్తుగా థియేటర్స్ కి వస్తున్నాయి. చాలా చోట్ల వాటి షోలు కేన్సిల్ అవుతున్నాయి. ఇక ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ కి పరిగెత్తుకు వచ్చే డబ్బింగ్ సినిమాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ వారం వచ్చిన శివకార్తికేయన్ ‘మహావీరన్’ .. ఉదయనిధి ‘నాయకుడు’ పరిస్థితి అలాగే ఉంది.

ఉదయనిధి స్టాలిన్ సినిమాలకి ఇక్కడ అంత మార్కెట్ లేదు. ఆయన సినిమాలు ఇక్కడ భారీ వసూళ్లను సాధించిన దాఖలాలు లేవు. ఇక్కడ ఈ సినిమా వైపుకి ఆడియన్స్ దృష్టిని మళ్లించే ప్రయత్నం కూడా పెద్దగా జరగలేదు. శివకార్తికేయన్ కి మాత్రం ఇక్కడ ఓ మాదిరి గుర్తింపు ఉంది. ఆయన ‘రెమో’ .. ‘సీమరాజా’ .. ‘డాక్టర్’ .. ‘ప్రిన్స్’ సినిమాలు ఇక్కడ ఓ మాదిరి వసూళ్లను రాబట్టాయి. తన సినిమాల తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన యాక్టివ్ గానే ఉంటాడు మరి. కానీ ఎందుకో ఈ సారి ఎలాంటి హడావిడి లేకుండా ‘మహావీరన్’ థియేటర్స్ కి వచ్చింది. ప్రమోషన్స్ లేని ఎఫెక్ట్ థియేటర్స్ దగ్గర తెలుస్తూనే ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్