Thursday, March 19, 2026
Homeసినిమాయువత‌కు నచ్చేలా ‘వర్జిన్ స్టోరి’ ఉంటుంది : లగడపాటి శ్రీధర్

యువత‌కు నచ్చేలా ‘వర్జిన్ స్టోరి’ ఉంటుంది : లగడపాటి శ్రీధర్

Youth Story: ప్ర‌ముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరి’. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. వర్జిన్ స్టోరి సినిమా ఈనెల 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ప్రెస్ మీట్ లో తెలియజేశారు యూనిట్.

హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ “టీనేజ్ ను టార్గెట్ చేస్తూ హాలీవుడ్ లో కొన్ని ప్రత్యేక చిత్రాలు వస్తుంటాయి. మన దగ్గర అలా లేదు. వర్జిన్ స్టోరీ టీనేజ్ వారికి నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్ లో రొమాన్స్ ఉండాలి. లేకుంటే చాలా మెమొరీస్ కోల్పోతారు. థర్డ్ వేవ్ తర్వాత మళ్లీ సినిమాలకు మంచి రోజులు వచ్చాయి. తాజాగా డిజె టిల్లు ఇతర సినిమాలకు కలెక్షన్స్ బాగుంటున్నాయి. వాలెంటైన్స్ వీక్ లో మా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల18న థియేటర్లలో చూడండి”అన్నారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ “నేటి యువతకు అన్నీ వేగంగా జరగాలి. ఫుడ్ కావాలంటే నిమిషాల్లో తెప్పించుకుంటారు. ఇష్టమైన వ్యక్తులను పొందడంలో కూడా అదే వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు, కోరుకున్న కెరీర్ కు మీరు సమయం ఇవ్వాల్సిందే. లేకుంటే అవి దక్కవు. ప్రేమకు అసలైన పరీక్ష ఏంటో చెప్పే సినిమా ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు పాల్గొని సినిమా విజయం పై ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : ఇంప్రెస్ చేసిన ‘వర్జిన్ స్టోరి’ ట్రైలర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular