Sunday, September 8, 2024
Homeసినిమాలక్ష్ చదలవాడ కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్ చదలవాడ కొత్త చిత్రం ప్రారంభం

Laksh new film:
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అయితే మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ హీరో తాజాగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ వినూత్నమైన సినిమా తొందరలోనే షూటింగ్ కు వెళ్లనుంది. ప్రొడక్షన్ నంబర్ 12 గా చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాని పద్మావతి చదలవాడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లోని ఆఫీస్ కార్యాలయం లో జరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్