Wednesday, January 22, 2025
Homeసినిమాలక్ష్ హీరోగా పవర్‌ఫుల్ టైటిల్ 'ధీర'

లక్ష్ హీరోగా పవర్‌ఫుల్ టైటిల్ ‘ధీర’

Laksh in Dheera: కెరీర్ పరంగా చాలా డిఫరెంట్‌గా అడుగులేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఆయన తాజా సినిమా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేసిన నిర్మాతలు అదే బ్యానర్ పై లక్ష్ హీరోగా మరో పవర్‌ఫుల్ మూవీ అనౌన్స్‌ చేశారు. ‘ధీర’ అనే పేరుతో టైటిల్ లుక్ రిలీజ్ చేశారు.

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై పద్మావతి చదలవాడ ఈ ‘ధీర’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వడమే గాక.. విడుదలకు ముందే ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ మ్యూజిక్‌తో ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్న సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి ఈ మూవీని చాలా గ్రాండ్‌గా రూపొందిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఓ వైపు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ టీజర్‌తో సూపర్ ట్రీట్ ఇస్తున్న హీరో లక్ష్.. టీజర్‌ రిలీజ్ రోజే తన కొత్త సినిమా ప్రకటన రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ముందు ముందు మరిన్ని వైవిద్యభరితమైన కథలతో అలరిస్తానని అన్నారు. ‘ధీర’ అనే టైటిల్‌తో రాబోతున్న తన కొత్త సినిమాలో క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు టచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్రయూనిట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్