Sunday, January 19, 2025
HomeTrending Newsలంబసింగి చారిత్రక ప్రదేశం : రోజా

లంబసింగి చారిత్రక ప్రదేశం : రోజా

టూరిజంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా సింహాచలం దేవస్థానానికి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. అల్లూరి సితారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం లంబసింగిలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన హరిత హిల్ రిసార్ట్స్ ని రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి, ఎమ్మెల్సీ వరుడు కల్యాణి, టూరిజం చైర్మన్ వరప్రసాద్ తో పాటు టూరిజం శాఖ అధికారులు, స్థానిక వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… లంబసింగి కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదని చారిత్రక ప్రదేశమని అన్నారు. అరకు, లంబసింగి టూరిజం సర్క్యూట్ కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్