Thursday, March 12, 2026
Homeసినిమాయండమూరి చేతుల మీదుగా ‘లాంప్’ ఫస్ట్ లుక్

యండమూరి చేతుల మీదుగా ‘లాంప్’ ఫస్ట్ లుక్

నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ‘ఏడుచేపలకథ’ నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘లాంప్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ “డైరెక్టర్ రాజశేఖర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యాను. అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచి పేరు రావాలని” అన్నారు.

నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “ఏడుచేపలకథ లాంటి హిట్ సినిమా తర్వాత ఎలాంటి మూవీ చేద్దామని ఆలోచిస్తున్న టైములో రాజశేఖర్ లాంప్ మూవీ కథ చెప్పాడు నాకు బాగా నచ్చి చేశాను సినిమా బాగా వచ్చింది అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ “ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటూ ఒక చిన్న మెసేజ్ అందర్నీ అలరిస్తుంది” అన్నారు. రాకేష్ మాస్టర్, సిహెచ్. నాగేంద్ర, వై.వి.రావ్, చలపతి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : క్రిష్ బొంగొని , ఎడిటింగ్ : గణేష్ దాసరి , మ్యూజిక్ : శ్రీ వెంకట్ , నిర్మాత : జి వి యన్ శేఖర్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : రాజశేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular